చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 11

◆ సంఘటనలు

1906 : మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు.
2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు

◆ జననాలు

1911: లాలా అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (మ.2000).
1895: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982)
1915: పుపుల్ జయకర్, భారతదేశ కళాకారిణి, రచయిత్రి. (మ.1997)
1955: బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.
1986: శ్రియా సరన్, సినీ నటి.
1986: అంజలి , తమిళ, తెలుగు, సినీ నటి.

◆ మరణాలు

1921: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882)
1947: దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895)
1948: ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876)
1983: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (జ.1909)
1987: మహాదేవి వర్మ, ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907)
2014: గోవిందరాజు సీతాదేవి, కథ, నవలా రచయిత్రి.
2022: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940)