Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు మార్చి 06

చరిత్రలో ఈరోజు మార్చి 06

★ దినోత్సవం

  • ఘనా గణతంత్ర దినోత్సవం

★ సంఘటనలు

2009: న్యూయార్క్ లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.

★ జననాలు

1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564)
1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు
1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966)
1917: పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు(మ.1984)
1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
1933: కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.
1984: శర్వానంద్ , తెలుగు, తమిళ ,చిత్రాల నటుడు
1988: ఇషా చావ్లా, భారతీయ చలనచిత్ర నటి, పలు తెలుగు చిత్రాలలో నటించింది .
1997: ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె)

★ మరణాలు

1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు.
1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)
2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971)
2019: కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు. (జ.1932)