Home > EDUCATION > INTERMEDIATE > జగిత్యాల జిల్లాలో సీఎస్, డివో లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఉపసహకరించుకోవాలి.

జగిత్యాల జిల్లాలో సీఎస్, డివో లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఉపసహకరించుకోవాలి.

  • ఇంటర్ పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వమే వాహనంతో కూడిన ఎస్కార్ట్ సౌకర్యం కల్పించాలి. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి టీజీజెఎల్ఏ -475 వినతి పత్రం

BIKKI NEWS (MARCH 06) : Show cause notices to CS and DO s of inter exams in jagtial. జగిత్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణలో ఉన్న సుమారు పదిమంది చీఫ్ సూపర్డెంట్ లకు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ లకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి జారీ చేసిన షోకాజు నోటీసులను వెంటనే ఉపసహకరించుకోవాలని, గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి గారికి, తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గారికి ఈరోజు ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వస్కుల. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లూ తెలిపారు.

Show cause notices to CS and DO s of inter exams in jagtial

మార్చి 5 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కావడం జరిగిందని, పోలీస్ స్టేషన్ నుంచి ఎగ్జామ్స్ సెంటర్ వరకు మరియు పరీక్షల అనంతరం ఆన్సర్స్ బండిల్సును పోస్ట్ ఆఫీస్ వరకు త్రీ వీలర్ పై ఎందుకు తీసుకువెళ్లారని,.ఇంటర్ బోర్డు సెక్రెటరీ గారు సూచన ప్రకారం ఎస్కార్ట్ అండ్ క్లోజ్డ్ ఫోర్ వీలర్ తో ( కార్ల) తీసుకువెళ్లనందుకు సమాధానం చెప్పాలని,.గౌరవ జగిత్యాల జిల్లా కలెక్టర్ సుమారు పదిమంది ఇంటర్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్లు ఆఫీసర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం చాలా విచారకరమైన విషయమని తెలిపారు.

ఈ విధులు నిర్వహణలో ఉన్నవారికి చాలా మందికి సొంత కారులు లేవని, వీటికి తీసుకు వెళ్ళేందుకు ట్రావెలింగ్ అలవెన్స్ కింద ప్రతిరోజు 188/_ రూపాయలు మాత్రమే చెల్లిస్తారని తెలిసింది, ఫోర్ వీలర్ వాహనమును ఎంగేజ్ చేయాలంటే సుమారు ప్రతిరోజు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు.

అదేవిధంగా చీప్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంట్లు ఆఫీసర్ కు డ్యూటీ చేసినందుకు ప్రతి సెషన్ కు రెమిరరేషన్ 352/- మరియు 313/- రూపాయలు మాత్రమే చెల్లిస్తారని తెలుపుతూ, ఈ నేపథ్యంలో ఫోర్ వీలర్ ను ఎంగేజ్మెంట్ చేసుకోవటం చాలా ఖర్చుతో కూడిన విషయం అని తెలుపుతూ.. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్ష నిర్వహణలో ఉన్న చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చాలా ఆందోళన ఉన్నారని తెలిపారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష నిర్వహించడానికి కీలకమైన చీఫ్ సూపర్డెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా విధులు నిర్వహించవలసిన అవసరం ఉందని తెలుపుతూ, ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డు జోక్యం చేసుకొని జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా పరీక్ష సెంటర్లకు క్లోజ్డ్ ఎస్కార్ట్ వాహనం సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ప్రభుత్వం మరియు ఇంటర్ బోర్డు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు