చరిత్రలో ఈరోజు జూలై 16

Today in history july 16th

◆ దినోత్సవం

  • ప్రపంచ పాముల దినోత్సవం

◆ సంఘటనలు

0622: ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. (హిజ్రీ శకం)
1439: ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.
1661: బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో “బేంక్ నోట్స్”ని విడుదల చేసింది. (ప్రవేశ పెట్టింద్).
1880: డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.
1862: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త ‘స్విప్ట్-టట్టల్’ అనే తోకచుక్కను కనుగొన్నాడు.
1918: నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు.
1926: నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.
1936: రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు.
1941: 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.
1945: “ఫేట్ బాయ్” అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి “అణు యుగం” ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ “మన్‌హట్టన్ ప్రాజెక్టు”గా పేరు పెట్టారు..
1945: మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
1965: ‘ది మాంట్ బ్లాంక్’ రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
1969: అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
1979: సద్దాం హుస్సేన్, ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు.
1990: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.
1972: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది.
1976: ఆర్.డి. భండారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)
1983: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
1993:బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.

◆ జననాలు

1704: జాన్ కే, ఇంగ్లాండ్, మెషినిస్ట్, ఫ్లైయింగ్ షటిల్ కనుగొన్న శాస్త్రవేత్త.
1746: జియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని (ఏస్టరాయిడ్) కనుగొన్నాడు (గ్రహశకలం పేరు: సెరెస్).
1872: రోల్డ్ అముండ్‌సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు (మ.1928).
1940: పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాధకుడు, రచయిత. [ మరణము. 2014]
1888: ఫ్రిట్జ్ జెర్నికె, ‘ఫేజ్-కంట్రాస్ట్ మైక్రోస్కోప్’ ని కనుగొన్నాడు.
1896: ట్రైగ్వె లీ, మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ (1946-52)
1909: అరుణా అసఫ్ అలీ, స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ.1996)
1922: ఎస్. టి. జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011)
1923: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (మ.2017)
1924: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, లోక్‌సభ సభ్యురాలు (మ.2007).
1965: శేఖర్ (కార్టూనిస్టు), కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాల పైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి
1975: భువనేశ్వరి (నటి), తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పాటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది.
1981: గోపీచంద్ లగడపాటి, సిని నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత.
1983: కట్రీనా కైఫ్, భారతీయ సినీ నటి

◆ మరణాలు

1999 – ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు.
2015: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)