BIKKI NEWS : today in history december 10th
today in history december 10th
దినోత్సవం
- అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
- ప్రపంచ జంతువుల హక్కుల దినం.
సంఘటనలు
1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (1973 జనవరి 10 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు).
1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 1978 మార్చి 6 వరకు).
1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.
జననాలు
1877: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తి. (మ.1910)
1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972).
1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి (మ.1982).
1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
1902: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
1920: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
1948: రేకందార్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి.
1952: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011)
1954: జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు.
1960: రతి అగ్నిహోత్రి , పలు భారతీయ చిత్రాల నటి
1985: కామ్నా జఠ్మలానీ, దక్షిణ భారత చలన చిత్ర నటి, ప్రచార కర్త.
మరణాలు
1896: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833).
1990: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకుడు (జ.1896).
2013: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927).
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER