GURUKULA JOBS -టీజీటీ అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదు లింక్

BIKKI NEWS (FEB. 21) : తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని (TGT APPLICANTS UPDATE THEIR TET SCORE) ఫిబ్రవరి – 21 (బుధవారం) సాయంత్రంలోగా అప్డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లు గురుకుల పాఠశాలల నియామక బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అనంతరం టీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వివరించింది. అనంతరం 4,020 పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించనుంది.

TGT – TET MARKS ADDING LINK