TG POLYCET COUNSELLING – నేటినుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

BIKKI NEWS (JUNE 20) : TG POLYCET 2024 COUNSELLING STARTS FROM JUNE 20th. తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానున.నట్లు కన్వీనర్‌, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

TG POLYCET 2024 COUNSELLING

రాష్ట్రంలో 118 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 26,412 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 24 కోర్సులున్నాయని తెలిపారు.

జూన్ 20 నుంచి ఈనెల 24 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించొచ్చనీ, ధ్రువ పత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు.

జూన్ 22 నుంచి 25 వరకు ధ్రువ పత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు.

జూన్ 22 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.

జూన్ 30న తొలి విడత పాలిసెట్‌ ప్రవేశాలకు సీట్లను కేటాయిస్తామని తెలిపారు.

జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు.

జూలై 18 నుంచి పాలిటెక్నిక్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.

జూలై 15 నుంచి 17 వరకు ఓరియెంటేషన్‌ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు.

వెబ్సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/#

LATEST CURRENT AFFAIRS IN TELUGU

OUR TELEGRAM CHANNEL LINK