రైతు రుణమాఫీ కి కేబినెట్ ఆమోదం

BIKKI NEWS (JUNE 21) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరుగుతుంది.. ఈ భేటీలో ముఖ్యమైన కాంగ్రెస్ హామీ అయినా రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం (telangana cabinate approved farm loan waiving) తెలిపింది.

Telangana cabinate approved farm loan waiving

డిసెంబర్ 12 – 2018 నుంచి 2023 డిసెంబర్ 9 కంటే ముందు రుణాలు తీసుకున్న రైతుల యొక్క రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

అయితే రైతు రుణమాఫీకి అర్హతలను నిర్దేశించడానికి కేబినెట్ తీవ్ర కసరత్తు చేసినట్లు సమాచారం. ఎవరెవరికి రైతు రుణమాఫీ చేయాలి, ఎలా చేయాలి అనే దానిమీద సుదీర్ఘ చర్చ జరుగుతుంది.

ఉన్నత వర్గాలకు, టాక్స్ పేయర్లకు, ఉద్యోగస్తులకు మరియు రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్న వారికి రైతు రుణమాఫీ నుండి మినహాయింపు ఇవ్వాలని, వారికి రైతు రుణమాఫీ చేయకూడదని ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది.

అయితే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఒకే ధపాలో చేయాలా లేక లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి ఒకసారి, 1,50,000 వరకు లోన్ తీసుకున్న వాళ్లకి రెండో దశలో, రెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్నవారికి మూడో దశలో… విడతల వారీగా రైతు రుణమాఫీ చేయాలని యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

మొత్తం రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయల అవసరం ఏర్పడుతుందని అంచనా. ఈ మేరకు నిధుల సమీకరణ ఒక సవాలుగా మారనుంది. వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు హామీ ఇస్తూ రైతు రుణమాఫీ చేయడం ఒక మార్గం కాగా, దశల వారీగా రైతు రుణమాఫీ రెండో అవకాశంగా ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటిమీద కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ వర్గాలు వివరించే అవకాశం ఉంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు