Home > SPORTS > సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ విజేత పంజాబ్

సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ విజేత పంజాబ్

BIKKI NEWS (నవంబర్ – 07) :సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ 2023 విజేతగా పంజాబ్ నిలిచింది. ఫైనల్ లో బరోడా పై 20 పరుగుల తేడాతో విజయం సాదించి టైటిల్ (Syed mushtaq ali trophy 2023 won by panjab)నెగ్గింది. గతంలో నాలుగుసార్లు ఈ టోర్నీలో ఫైనల్ చేరిన పంజాబ్.. ఎట్టకేలకు టైటిల్ దక్కించుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అన్మోల్ ప్రీత్ సింగ్ సెంచరీ (113) సాధించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసింది.

224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి గట్టిగా పోరాడిన బరోడా చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరుగులకే పరిమితమైంది. అభిమన్యు సింగ్ (61), నినాద్ (47), కెప్టెన్ కృనాల్ పాండ్య (45) రాణించారు. 19వ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన అర్షదీప్ సింగ్ (4/23) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.