Home > TELANGANA > NOTARY LANDS : నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ పై స్టే – హైకోర్టు

NOTARY LANDS : నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ పై స్టే – హైకోర్టు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నోటరీ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Stay on notary lands regularization go

రాష్ట్రంలోని నోటరీ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84 ను గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొందరు హైకోర్టును సంప్రదించగా ఈరోజు సంబంధిత జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.