రాష్ట్ర పండుగలుగా చాకలి ఐలమ్మ.. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 26): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని సెప్టెంబర్ -26న, ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సెప్టెంబర్ 27న రాష్ట్ర పండుగలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ilamma-and-konda_laxman_bapuji birth-anniversaries-are-now-state-festivals

లక్ష్మణ్ బాపూజీ జయంతిని దిల్లీలోని తెలంగాణళభవన్లోనూ వేడుకగా నిర్వహించాలని రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.