SPOT ADMISSIONS – ఎస్సీ ఇంటర్ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు

BIKKI NEWS (JULY 25) : SPOT ADMISSIONS IN INTER GURUKULAS. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్, ఒకేషనల్ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకోసం జూలై 26, 27 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి తెలిపారు.

SPOT ADMISSIONS IN INTER GURUKULAS

26న బాలికలకు, 27న బాలురకు ఉదయం 9.00 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

స్పాట్ కౌన్సెలింగ్ సంబంధిత రీజియన్ల పరిధిలోని బాలికలకు లక్షెట్టిపేట, చింతకుంట, వరంగల్ వెస్ట్, టేకులపల్లి, చేవెళ్ల, మెదక్, మహబూబ్నగర్ (రామిరెడ్డి గూడెం), ధర్మారం, నిడమనూరు, వలిగొండ బాలికల విద్యాసంస్థల్లో,

బాలురకు బెల్లంపల్లి, పెద్దపల్లి, వర్ధన్నపేట, తిరుమలాయపాలెం, కందుకూరు, హత్నూర యూజీ, జేపీనగర్, భిక్నూరు, అనుముల, భువనగిరి బాలుర కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు