ICC T20 WC – SOUTH AFRICA REACHES FINAL

BIKKI NEWS (JUNE 27) : SOUTH AFRICA REACHES FINAL of ICC T20 WC. టి20 వరల్డ్ కప్ 2024లో సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్ కు చేరింది. ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్ కు చేరడం సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇదే మొదటిసారి కావడం విశేషం.

SOUTH AFRICA REACHES FINAL of ICC T2O WC

సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటివరకు ఐసీసీ టోర్నీ లలో ఎనిమిది సార్లు సెమీఫైనల్ కు చేరగా ఆరుసార్లు ఓడిపోయి ఒక మ్యాచ్ టై అయింది. ఈరోజు గెలవడంతో మొదటి సారి ఫైనల్ కు చేరింది.

ఐసీసీ టోర్నీలో వరుసగా ఎనిమిది విజయాలతో ఆస్ట్రేలియాతో కలిసి మొదటి స్థానంలో ఉంది.

ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మొదటి సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ జట్టును కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌట్ చేయడం జరిగింది.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యన్‌సెన్, శాంప్సీ తలో మూడు వికెట్లు, రబాడా, నోర్ట్జీ తలో రెండు వికెట్లు తీయడం జరిగింది. ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ గా మార్కో యన్‌సెన్ నిలిచాడు.. సౌత్ ఆఫ్రికా జట్టు 8.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.

ఈరోజు రాత్రి 8 గంటలకు జరగనున్న భారత్ – ఇంగ్లాండ్ సెమీఫైనల్ రెండో మ్యాచ్ లో గెలిచిన జట్టు సౌతాఫ్రికా తో ఫైనల్లో జూన్ 29న తలపడనుంది.

సౌత్ ఆఫ్రికా చాలా బలమైన జట్టు అయినప్పటికీ ఐసీసీ టోర్నీలలో ఇంతవరకు కప్ నెగ్గలేకపోయింది. దాదాపు 8 సార్లు సెమీఫైనల్ కు చేరి, ఆరుసార్లు ఓడిపోయి ఒకసారి టై అయింది. గ్రూప్ టాపర్ గా లేకపోవడంతో జట్టు ఫైనల్ కు చేరలేదు.

మరోవైపు ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ కు చేరి సంచలనం సృష్టించిన ఆప్ఘనిస్తాన్ జట్టు, తన స్థాయికి తగ్గ ఆటను కీలక నాకౌట్ మ్యాచ్ లో ప్రదర్శించలేక చతికిలబడింది.

సంక్షిప్త స్కోర్
అఫ్ఘనిస్తాన్ – 56/10 (11.5 ఓవర్లు)
సౌతాఫ్రికా – 60/1 (8.5 ఓవర్లు)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు