BIKKI NEWS (JUNE 25) : schools bandh in telangana on June 26th. ఏబీవీపీ జూన్ – 26 తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలలేమి వంటి అంశాలపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బందు కు పిలుపునిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు కొన్ని ప్రధాన డిమాండ్లను ఉంచారు.
ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో లక్షలలో వసూలు చేస్తున్న ఫీజు ను నియంత్రించాలి.
పుస్తకాలు, యూనిఫామ్స్ ను ప్రైవేటు పాఠశాలలు అమ్ముతున్న నేపథ్యంలో వెంటనే నిరోధించాలి.
ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలి.
ప్రభుత్వ గుర్తింపు పొందని, నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపును వెంటనే రద్దుచేసి చర్యలు తీసుకోవాలి.
డీఈవో, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే ఉపాధ్యాయులను పూర్తి చేయాలి
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలి.
మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 24 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ప్రభుత్వ పాఠశాలలో వెంటనే అటెండర్ మరియు స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలి
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 20% పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.