Home > FARMER'S NEWS > Rythu Bharosa : 16న రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa : 16న రైతు భరోసా నిధులు విడుదల

BIKKI NEWS (JUNE 14) : Rythu bharosa amount credit on June 16th. రైతు భరోసా సాయాన్ని జూన్ 16న విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

Rythu bharosa amount credit on June 16th.

ఇటీవల జరిగిన వ్యవసాయశాఖ సమీక్ష, మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు. పథకానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్థికశాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా.. నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది.

రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు.. లబ్ధిదారుల జాబితాను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. 16వ తేదీనే మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు