సివిల్స్ ప్రిలిమ్స్ పాసైతే లక్ష ఆర్థిక సహయం – అర్హతలు

BIKKI NEWS (JULY 20) : RAJIV GANDHI CIVILS PRELIMS ABHAYAHASTAM SCHEME. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్దుల కోసం నూతన పథకం “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రకటించింది.

ఈ పథకం ద్వారా యూపిఏస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షలకు అర్హత సాదించిన అభ్యర్దులకు లక్ష రూపాయల ఆర్థిక సహయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఆర్థిక సహాయంతో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు కోచింగ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. మెయిన్స్ పరీక్షల కు సంబంధించిన మెటీరియల్ను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

RAJIV GANDHI CIVILS PRELIMS ABHAYAHASTAM SCHEME GUIDELINES
  • అభ్యర్థులు జనరల్ (EWS)/బీసీ/ఎస్సీ/ఎస్టీలై ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • యూపీఎస్సీ ప్రిలిమినరీలో పాస్ కావాలి.
  • వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు మాత్రమే ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
  • ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహం అందుతుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు