BIKKI NEWS (AUG. 31) : Rain holiday on September 2nd in hyderabad. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సెప్టెంబర్ 2 అనగా సోమవారం నాడు హైదరాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
Rain holiday on September 2nd in hyderabad
ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా సెలవుపై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హైదరాబాదులో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.