PhD in HCU – హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 25) : PhD admissions in Hyderabad Central University. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2024 25 విద్యా సంవత్సరం కోసం వివిధ సబ్జెక్టులలో పిహెచ్డి కోర్సులో అడ్మిషన్ల కొరకు ఆన్లైన్ దరఖాస్తులను యూనివర్సిటీ ఆహ్వానిస్తుంది రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సీట్లు కేటాయించనున్నారు అయితే జేఆర్ఎస్ అర్హత కలిగిన వారు రాత పరీక్ష రాయనవసరం లేదు

PhD admissions in Hyderabad Central University

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం సీట్ల సంఖ్య: 170.

సబ్జెక్టులు : ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, కమ్యూనికేషన్, మెటీరియల్ ఇంజినీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ తదితరాలు.

అర్హతలు : కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 14 – 2024

హల్ టికెట్ల విడుదల : అక్టోబర్ 10 – 2024

ప్రవేశ పరీక్ష తేదీలు :అక్టోబర్ 19, 20 – 2024

ఇంటర్వ్యూ తేదీలు : నవంబర్ 19, 20, 21 వ తేదీలలో

కౌన్సెలింగ్ షెడ్యూల్ : డిసెంబర్ 11, 12 – 2024

తరగతులు ప్రారంభం : జనవరి 02 – 2025 నుంచి

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : http://acad.uohyd.ac.in/phd24july.html

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు