BIKKI NEWS (FEB. 02) : జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు అమలు చేయాలని (PAY SCALE FOR MGNEGRA EMPLOYEES IN TELANGANA) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సంబంధిత దస్త్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. రాష్ట్రంలో 2005 నుంచి జాతీయ ఉపాధిహామీ పథకంలో ఏపీవోలు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ సలహాదారులు, మేనేజర్లు తదితర విభాగాల కింద 3,874 మంది పనిచేస్తున్నారు.