Home > TELANGANA > హైదరాబాద్ కు మరో ఎలివేటేడ్ కారిడార్

హైదరాబాద్ కు మరో ఎలివేటేడ్ కారిడార్

BIKKI NEWS (MARCH 08) : ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయినిపల్లి, డెయిరీ ఫామ్‌ రోడ్ వరకు సాగే ఈ ఎలివేటేడ్ డబుల్ కారిడార్ (Paradise to diary form road elevated corridor) నిర్మాణానికి శనివారం సాయంత్రం 5 గంటలకు కండ్లకోయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

ఒకవైపు ప్యాట్నీ నుంచి కరీంనగర్ హైవేపుకు ఎలివేటెడ్‌ కారిడార్‌, మరోవైపు మెట్రో రైలు విస్తరణల కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్ నగర నలుమూలలు అభివృద్ధి సాధించాలన్న లక్ష‍్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఎలివేటెడ్‌ డబుల్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఎలివేటెడ్ కారిడార్ వివరాలు

  • 5.3 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్
  • 6 లేన్ల రహదారి.. రెండో దశలో మెట్రో రైల్ మార్గం
  • రూ. 1580 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
  • జాతీయ రహదారి-44 మార్గానికి మహర్దశ
  • సికింద్రాబాద్‌ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి
  • హైదరాబాద్‌ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది.