BIKKI NEWS : PARA ASIAN GAMES 2022 లో భారత్ దివ్యాంగ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. 111 పతకాలతో (29 స్వర్ణ, 31 రజత, 51 కాంస్యాలు) కొత్త రికార్డు నెలకొల్పుతూ పోటీలను 5వ స్థానంలో నిలిచి ఘనంగా ముగించారు.
ఇటీవల ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధిం చిన భారత్… 2010 దిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 101 పతకాలు నెగ్గింది. తాజా ప్రదర్శనతో భారత్ పారా ఆసియా క్రీడల్లో అయిదో స్థానంలో నిలిచింది. ఆతిథ్య చైనా 521 పతకాలతో (214 స్వర్ణాలు, 167 రజతాలు, 140 కాంస్యాలు) అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.