INTER – ఈ ఏడాది ఆన్లైన్ మూల్యాంకనం

BIKKI NEWS (JULY 15) : ONLINE VALUATION IN INTERMEDIATE. ఇంటర్మీడియట్ విద్యలో ఏడాది నుండి ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. గత రెండేళ్లుగా ఈ పద్ధతిని అమలు చేయాలని ప్రయత్నాలు చేసినా… ప్రభుత్వం నుండి అంగీకారం రాకపోవడంతో నిలిపివేశారు. అయితే ఈ ఏడాది నుండి తప్పనిసరిగా ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆన్లైన్ మూల్యాంకనం వల్ల త్వరగా ఫలితాలు విడుదల చేయవచ్చని బోర్డ్ భావిస్తోంది. ఇప్పటికే అన్నీ యూనివర్సిటిలలో, డిగ్రీలో ఆన్లైన్ మూల్యాంకనం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జరుగుతున్న మూల్యాంకన విధానం వల్ల మూల్యాంకల కేంద్రాలను ఏర్పాటు చేసి అధ్యాపకులు మూల్యాంకన కేంద్రానికి వచ్చి మూల్యాంకనం చేసి వెళ్లాల్సి వస్తుంది దీంతో చాలామంది అధ్యాపకులు మూల్యాంకన కేంద్రాలకు వచ్చి పేపర్లు దిద్దడానికి వాదన ఉంది. ఈ నేపథ్యంలో మూల్యంకణాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనేలా చేయవచ్చని అలాగే మూల్యాంకనలో జరిగే అవకతవకలను భారీగా తగ్గించవచ్చు అని బోర్డు భావిస్తుంది

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు