NURSING JOBS – జపాన్ లో నర్సింగ్ ఉద్యోగాలకై టెస్ట్

హైదరాబాద్ (డిసెంబర్ 6) : జపాన్ దేశంలో నర్సింగ్ ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 7న హైదరాబాద్ శివం రోడ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ (NIST) ప్రాంగణంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(NURSING JOBS IN JAPAN – TOMCOM) ఒక ప్రకటనలో తెలిపింది.

22 నుంచి 30 ఏండ్ల వయస్సు ఉండి, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఎంపికైన అభ్యర్థులకు ముందుగా జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణ ఉంటుందని తెలిపింది. వివరాలకు TOMCOM వెబ్సైట్ ను సంప్రదించాలని కోరింది.