Home > INTERNATIONAL > NO KINGS – అమెరికాలో భారీ నిరసనలు

NO KINGS – అమెరికాలో భారీ నిరసనలు

BIKKI NEWS (JUNE 15) : NO KINGS PROTEST AGAINST TRUMP.bడొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని చిన్న పట్టణాలు మొదలు నగరాల వరకూ శనివారం “నో కింగ్స్” నిరసన ప్రదర్శనలు జరిగాయి.

NO KINGS PROTEST AGAINST TRUMP

కొద్దిమంది కోసం పనిచేస్తున్న ట్రంప్ సర్కారు నశించాలి, మినీ ముస్సోలినీని దేశం నుంచి తరమండి అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు,

అట్లాంటా ఫిలడెల్ఫియా, నార్త్ కరొలినాలోని 50501 మూవ్మెంట్ అనే పేరు గల బృందం ఈ ప్రదర్శనల్ని నిర్వహించింది. ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిని నిరసించేందుకే తమ ఉద్యమానికి “నో కింగ్స్” అని పేరు పెట్టామని ఆ బృంద నేతలు పేర్కొన్నారు.

Los Angeles Search operation stopped

అక్రమ వలసదారులను వలస సేవలు, సుంకాల విభాగం అధికారులు అరెస్టులు చేయడానికి వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లాస్ఏంజెలెస్ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్లు మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది..