NEET (UG) 2024 NOTIFICATION – నీట్ పూర్తి నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 08) : NEET UG 2024 NOTIFICATION – దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులు అయినా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ఏటా ఎన్టీఏ నిర్వ‌హించే నీట్ యూజీ 2024 ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుదల చేశారు.

★ దరఖాస్తు గడువు : ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మార్చి 16వ తేదీ రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

★ పరీక్ష తేదీ : నీట్ యూజీ 2024 ప‌రీక్ష‌ను మే 5వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5:20 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

★ పరీక్ష నిర్వహించు భాషలు : ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాష‌ల్లో పెన్ను, పేప‌ర్ (OMR) విధానంలో ఈ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

దరఖాస్తు ఫీజు : జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు ₹1700/ (జ‌న‌ర‌ల్ ఈడ‌బ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ అభ్య‌ర్థుల‌కు ₹ 1600/- , ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థ‌ర్డ్ జండ‌ర్ అభ్య‌ర్థులు ₹1000/- )

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, ప‌రీక్షా కేంద్రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

దరఖాస్తు లింక్ : https://neet.ntaonline.in/frontend/web/

★ వెబ్సైట్ : https://nta.ac.in/medicalexam