NEET UG 2024 కౌన్సెలింగ్

BIKKI NEWS (AUG. 26) : NEET UG 2024 COUNSELING BY MCC. నీట్ యూజీ – 2024 మొదటి కౌన్సెలింగ్ రౌండ్ తుది సీట్ల కేటాయింపు ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.

NEET UG 2024 COUNSELING BY MCC

నీట్ – యూజీని విజయవంతంగా పూర్తి చేసిన 26,109 మంది అభ్యర్థులకు వారి అర్హత ఆధారంగా ఈ రౌండ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు కేటాయించారు.

ఫలితాలను ఎంసీసీ వెబ్సైట్ లో ఉంచారు. టాప్-17 ర్యాంకర్లు ఢిల్లీ – ఎయిమ్స్ ఎంబీబీఎస్ సీట్లు పొందారు. రెండో రౌండ్ కోసం పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ అవసరమైనవారు అధికారిక వికలాంగ కేంద్రాల్లో సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు వాటిని పొందవచ్చు.

ఆగస్టు 29లోగా తమకు కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. ఒకే విద్యా సంస్థలో క్యాటగిరీ లేదా కోటా మారినవారు తప్పనిసరిగా ఆన్లైన్ లో జనరేట్ చేసిన రిలీవింగ్ లెటర్ తీసుకొని సవరించిన కోటా లేదా క్యాటరిగీలో చేరాలి.

కొత్త క్యాటగిరీ లేదా కోటాలో చేరేవారికి తాజాగా ఆన్లైన్లో జనరేట్ చేసిన అడ్మిషన్ లెటర్ అవసరం. ఇది సమర్పించకపోతే కేటాయించిన సీట్ రద్దవుతుంది.

వెబ్సైట్ : https://mcc.nic.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు