NEET 2024 – ఆ విద్యార్థులకు మళ్ళీ నీట్ పరీక్ష

BIKKI NEWS (JUNE 13) : NEET 2024 EXAM WILL RECONDUCT ON JUNE 23rd. నీట్ 2024 ప్రవేశ పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను కూడా రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ విద్యార్థులు మళ్ళీ జూన్ 22న పరీక్ష రాయవచ్చని, ఫలితాలు జూన్ 30న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

గ్రేస్ మార్కులు కలపడం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ అంశంపై కేంద్రం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. అయితే నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయబోమని, కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఆపే ఉద్దేశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.