Home > SPORTS > NEERAJ CHOPRA : లుసానే డైమండ్ లీగ్ విజేతగా నీరజ్ చోప్రా

NEERAJ CHOPRA : లుసానే డైమండ్ లీగ్ విజేతగా నీరజ్ చోప్రా

లుసానే (జూలై – 01) : ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా 87.66 మీటర్ల త్రో తో లుసానే డైమండ్ లీగ్ 2023 లో అగ్రస్థానాన్ని పొంది విజేతగా నిలిచాడు. (Neeraj Chopra won the lusane diamond league 2023)

లుసానే డైమండ్ లీగ్ 2023లో నీరజ్ చోప్రా 87.66 మీ. విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. జూలియన్ వెబర్ (86.20 మీ) రెండో స్థానంలో నిలిచాడు.

చోప్రా ఆగస్ట్ 2022లో లుసానే లీగ్‌ను గెలుచుకోవడంతో తన మొదటి డైమండ్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ సంవత్సరం చివరిలో జరిగిన ఫైనల్‌లో డైమండ్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచాడు. మే 5న దోహాలో జరిగిన డైమండ్ లీగ్ టోర్నీలో 88.67 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు.