BIKKI NEWS (FEB. 23) : కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత 37 ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో మృతి (MLA LASYA NANDITHA PASSED WAY IN ROAD ACCIDENT) చెందారు. పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు మీద అతివేగం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే లాస్య నందిత మృతి చెందినట్లు సమాచారం.
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి గెలిచిన విషయం తెలిసిందే. సాయన్న గతేడాది అనారోగ్య కారణాల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే