Home > JOBS > AP JOBS > Jobs – మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు

Jobs – మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 26) : mangalagiri aiims jobs notification. మంగళగిరి ఎయిమ్స్ హస్పిటల్ లో 93 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబర్ 29వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

mangalagiri aiims jobs notification

గ్రూప్ ఏ‌, బీ‌, సీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

విభాగాలు : ఆయుష్, రేడియేషన్ థెరపీ/ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, క్లినికల్/ చైల్డ్, ఏసీ/ రిఫ్రిజిరేటర్, ల్యాబొరేటరీ, హైజినిస్ట్, మార్చురీ, ఎగ్జిక్యూటివ్/ పర్సనల్ తదితరాలు.

అర్హతలు : ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, పీజీ (ఎంఎస్సీ/ ఎంఏ), పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : రూ.1,500/-, ఎస్సీ/ఎస్టీలకు రూ.1,000/-. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.(గ్రూపు-ఎ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ‘రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నంబర్: 205, రెండో అంతస్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి.)

ఎంపిక విధానం : గ్రూపు ఎ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూపు బి, సి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.

వెబ్సైట్ : https://www.aiimsmangalagiri.edu.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు