Home > GENERAL KNOWLEDGE > ముఖ్య శాసనాలు వాటి ప్రాముఖ్యత

ముఖ్య శాసనాలు వాటి ప్రాముఖ్యత

BIKKI NEWS : రాజులు, రాజ కుటుంబాలు, మంత్రులు, సైన్యాద్యక్షులు.. తమ కాలం నాటి వివరాలను, విజయాలను, ఆచార వ్యవహారాలను పొందుపరుస్తూ వివిధ రకాల శాసనాలను (key-inscriptions-and-their-significance) వేయించారు

పోటీ పరీక్షలు అనే నేపథ్యంలో ముఖ్యమైన శాసనాలను అందులో పేర్కొన్న అంశాల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం.

★ అశోకుని రెండో ప్రధాన శిలాశాసనం:- ఇందులో ప్రజా సంక్షేమ చర్యలు, ప్రత్యాంత రాజ్యాల (చేర, చోళ, పాండ్య) గురించి పేర్కొన్నారు.

★ అశోకుని 18వ ప్రధాన శిలా శాసనం:- కళింగ యుద్ధం గురించి పేర్కొన్నారు.

★బబ్రు మైనర్ శిలాశాసనం (అశోక):- బౌద్ధ మతానికి చెందిన త్రిరత్నాలు (బుద్ధం, సంఘం, ధర్మం) గురించి తెలిపారు.

★ హతిగుంఫా శిలాశానసం:- చేది రాజ్యం గురించి, కళింగ ఖారవేలుడి విజయాల గురించి తెలుపుతున్న ఏకైక శిలా శాసనం.

★ అలహాబాద్ ప్రశస్తి:- సముద్ర గుప్తుని సైనిక విజయాలను తెలియజేస్తోంది.

★ బేస్ నగర్ శాసనం:- దీన్ని హీలియోడోరస్ అనే గ్రీకు రాయబారి వేయించాడు. ఇందులో ‘భాగవత మత‘ ప్రశస్తి కనిపిస్తుంది.

★ నానాఘాట్ శాసనం:- మొదటి శాతకర్ణి (శాతవాహన రాజు) సైనిక విజయాలను తెలియజేస్తుంది. దీన్ని ఆయన భార్య దేవి నాగానిక వేయించింది.

★ నాసిక్ శాసనం:- శాతవాహన రాజుల్లో అగ్రగణ్యుడైన గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను తెలియజేస్తోంది. ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించింది.

★ మెహ్రోలి ఇనుప స్తంభ శాసనం :- ఈ శాసనంలో చంద్ర గుప్త విక్రమాదిత్యుడి ప్రశస్తి ఉంది. ఆరు టన్నుల బరు వున్న ఈ శాసనం గుప్తుల కాలంనాటి లోహశాస్త్ర పరిజ్ఞా నానికి నిదర్శనం.

★ భానుగుప్తుని ఎరాన్ శాసనం:- క్రీ.శ. 510లో వేశారు. ‘సతీ సహగమనాన్ని (సతి) గురించి పేర్కొన్న మొదటి శాసనం.

★ ఐహోల్ శాసనం : బాదామి చాళుక్య పాలకుడైన రెండో పులకేశి సైనిక విజయాలను వివరిస్తోంది. జైన దేవాలయం లో లభించిన ఈ శాసనాన్ని క్రీ.శ.634లో రవికీర్తి వేయించాడు.

★ నౌపాసి బన్షికేర, బన్ షెరా శాసనాలు:- హర్షవర్ధనుడి గురించి పేర్కొంటున్నాయి.

★ ఉత్తర మేరూర్ శాసనాలు:- చోళ రాజైన మొదటి పరాంత కుడు వేయించాడు. ఇవి చోళుల కాలం నాటి గ్రామీణ పరిపాలన గురించి తెలియజేస్తున్నాయి.

★ సారనాధ్ స్తంభ శాసనం:- అశోకుడు వేయించాడు. దీని పై ఉన్న నాలుగు తలల సింహాలను జాతీయ చిహ్నంగా భారత ప్రభుత్వం గ్రహించింది.

★ అద్దంకి శాసనం:- దీన్ని వంటకంగారు మజుంరు. ఇది తరువోజ ఛందస్సులో ఉంది.

★ నాగార్జున కొండ, జగ్గయ్యపేట శాసనాలు :- వ్యాకుల చరిత్రకు ఆధారాలు.

★ నాగార్జున కొండ శాసనం:- చలికి రెమ్మణుడిని రాజు రాష్ట్ర అధిపతిగా పేర్కొంటుంది.

★ కొండముది తామ్ర శాసనం: బృహత్పలాయన వంశం గురించిన ఏకైక ఆధారం. దీనిలో జయవరు అనే పాలకుని ప్రస్తావన ఉంది.

★ గోరంట్ల తామ్ర శాసనం: అత్తివర్మ వేయించాడు.

★ మట్టిపాడు తామ్ర శాననం: దామోదరవరు వేయించాడు.

★ తుమ్మల గూడెం శాసనం: విష్ణు కుండిన రాజు గోవింద వర్మ వేయించాడు.

★ఈపూరు, ఖానాపూరు పాలమూరు శాసనాలు: విష్ణుకుండిన రాజు మాధవవర్మ వేయించాడు.

★ రామతీర్థ శాసనం: ఇంద్రవర్మ భట్టారక వర్మ వేయించాడు.

★ డుండి, తుమ్మల గూడెం చిక్కుళ్ల శాసనాలు: విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించాడు.

★ వేల్పూరు శాసనం:- విష్ణుకుండిన మాధవవర్మ వేయించాడు.

★ మంచికల్లు శాసనం:- ప్రాచీన పల్లవ మూల పురుషుడైన సింహవర్మ గురించి పేర్కొంటుంది.

★ మైదవోలు శాసనం:- పల్లవరాజు శివస్కంధవర్మ వేయించాడు.

★ చందులూరు శాసనం:- కుమార విష్ణువు అనే పల్లవరాజు వేయించాడు.

★ మారుటూరు శాసనం:- రెండో పులకేశి వేంగిని జయిం చినట్లు తెలుపుతోంది.

★ దాలగుండ శాసనం:- కదంబరాజు కుకుత్సవర్మ వేయించాడు.

★ విప్పర్ల శాసనం:- జయసింహ వల్లభుడు (చాళుక్య కుట్ల విష్ణువర్ధనుడి కుమారుడు) వేయించాడు.

★ కలమళ్ల శాసనం:- రేనాటి చోళరాజు ధనంజయుడు వేయించాడు.

★ నందంపూడి తామ్ర శాసనం:- రాజరాజ నరేంద్రుడు వేయిం చాడు. ఆంధ్ర శబ్దం భాషా వాచకంగా గోచరిస్తుంది.

★ చేజర్ల శిలాశాసనం:- ఇది ఆనంద గోత్రజుల చరిత్రను తెలియజేస్తుంది.

★ బెజవాడ శాసనం:- యుద్ధమల్లుడు వేయించాడు.

★ మాగల్లు శాసనం:- తూర్పు చాళుక్యరాజు దానర్ణవుడి గురించి తెలుపుతోంది.

హనుమకొండ శాసనం:- రుద్రదేవుడు వేయించాడు.