JEE Advanced 2024 – రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ మార్పు

BIKKI NEWS (APRIL 11) : JEE ADVANCED 2024 REGISTRATION SCHEDULE CHANGED – జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ను మారుస్తూ ఐఐటీ-మద్రాస్‌ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 27 నుంచి మే 7 సాయత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్‌ ను మార్చారు.

గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది.

పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే మే 26న పరీక్ష జరుగుతుంది.

వెబ్సైట్ : https://jeeadv.ac.in