జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం – 50వేలు, లక్ష ఆర్థిక సహాయం

విజయవాడ (డిసెంబర్ – 16) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి (JAGANANNA CIVIL SERVICES PROTHSAHAKAM) సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది.

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన పేద అభ్యర్థులకు నగదు ప్రోత్సాహం అందనుంది. అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

అర్హతలు : యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ లో అర్హత సాధించి ఉండాలి. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.

నగదు ప్రోత్సాహకం : ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి రూ. లక్ష మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి రూ.50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తారు.

దరఖాస్తు గడువు డిసెంబర్ 19 – 2023

https://jnanabhumi.ap.gov.in/#undefined1