Home > EDUCATION > INTERMEDIATE > INTER – విద్యార్థుల వాట్సప్ కే ఇంటర్ హల్ టికెట్లు

INTER – విద్యార్థుల వాట్సప్ కే ఇంటర్ హల్ టికెట్లు

BIKKI NEWS (FEB. 07) : Inter Hall tickets through Whatsapp Governance. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను నేరుగా విద్యార్థుల వాట్సాప్ కే అందించేందుకు వాట్సప్ గవర్నెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Inter Hall tickets through Whatsapp Governance.

ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు పది లక్షల మంది ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 10 నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే ఈ పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చి వాటిని ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేయనున్నారు ఇప్పటికే ఈ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతోంది

విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను అందించే ప్రక్రియను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా అమలు చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు