గురుకులాలన్ని ఒకే గొడుగు కిందకు – ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సమీక్ష

BIKKI NEWS (JUNE 23) : INTEGRATED RESIDENTIAL SCHOOLS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

INTEGRATED RESIDENTIAL SCHOOLS IN TELANGANA

ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే అన్ని రకాల గురుకులాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది దీని ద్వారా గురుకుల పాఠశాలలకు ఉన్న సొంత భవనాల సమస్య తీరిపోనుంది.

ఈ నేపథ్యంలో ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం. ఈ నమూనాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఒకే రకమైన ఇంటి దగ్గరికి స్కూల్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలను ఇంటిగ్రేటెడ్ విధానంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.

ఇలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా గురుకులాల నిర్వహణ సులభతరం కానుంది అలాగే విద్యార్థులకు ఒక యూనివర్సిటీలో చదువుతున్న అనుభూతి కలగనుంది

పైలట్ ప్రాజెక్ట్ గా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినా కొడంగల్ లో మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం అయినా మధిర నియోజవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు.

గత ప్రభుత్వంలో కొన్ని నియోజకవర్గాలలో ఎడ్యుకేషన్ హబ్ ల పేరుతో ఇలా ఇంటిగ్రేటెడ్ విధానాన్ని అమలు చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఒకే చోట భవనాలు నిర్మించి విద్యను అందించే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు