Home > SCIENCE AND TECHNOLOGY > INS VINDYAGIRI : జల ప్రవేశం

INS VINDYAGIRI : జల ప్రవేశం

కోల్‌కతా (ఆగస్టు – 18) : భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అధునాతన యుద్ధనౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా తయారు చేసిన INS VINDYAGIRI యుద్ధనౌకను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోల్‌కతాలోని హుగ్లీ నదీ తీరంలో ప్రారంభించారు. INS VINDYAGIRI LANXHING BY DROUPADI MURMU

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లు దీని సొంతమని, క్షిపణి దాడులతో విరుచుకుపడుతుందని యుద్ధనౌక నిర్మాణంలో పాలుపంచుకున్న ‘గార్డెన్ రీచ్ షిపిల్డర్స్’ అధికారులు వెల్లడించారు.

◆ ప్రాజెక్టు వివరాలు

  • ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది.
  • కర్ణాటకలోని పర్వతశ్రేణి పేరిట దీనికి వింధ్యగిరి అని పేరు పెట్టారు.
  • ఈ యుద్ధనౌక పొడవు 149 మీటర్లు.. బరువు 6670 టన్నులు
  • ఇది గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
  • భూమి, ఆకాశం, నీటి లోపల ఎదురయ్యే ముప్పులను ఇది తిప్పికొట్టగలదు.