Home > ESSAYS > INDIAN REPUBLIC DAY – భారత గణతంత్ర దినోత్సవం

INDIAN REPUBLIC DAY – భారత గణతంత్ర దినోత్సవం

BIKKI NEWS (జనవరి – 26) : భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జనవరి 26న (INDIAN REPUBLIC DAY ON JANUARY 26th) జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.

భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.

★ చరిత్ర

1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు. బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు.