Home > GENERAL KNOWLEDGE > భారత రాజ్యాంగ రచన – ముఖ్య తేదీలు

భారత రాజ్యాంగ రచన – ముఖ్య తేదీలు

BIKKI NEWS : indian constitution formation dates mportance time line. భారత రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టిన తర్వాత వివిధ తేదీలలో జరిగిన ముఖ్య సంఘటనలను పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థుల కోసం వివరంగా…

indian constitution formation dates mportance time line

డిసెంబర్ – 06 – 1946 : రాజ్యాంగ సభ ఏర్పాటు

డిసెంబర్ – 09 – 1946 : పార్లమెంట్ సెంట్రల్ హల్ (రాజ్యాంగ హల్) లో మొదటి రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. మొదట ప్రసంగించిన వ్యక్తి జేబీ కృపాలాని.

డిసెంబర్ – 11 – 1946 : రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్, వైస్ చైర్మన్ గా హరీంద్ర కూమర్ ముఖర్జీ, న్యాయ సలహాదారు గా బీఎన్. రావు లు ఎన్నికయ్యారు.

డిసెంబర్ – 13 – 1946 : జవహర్‌లాల్ నెహ్రూచే ‘ఆబ్జెక్టివ్ రిజల్యూషన్’ సమర్పించబడింది, రాజ్యాంగం యొక్క అంతర్లీన సూత్రాలను సూచించారు, అది తరువాత ‘రాజ్యాంగ ప్రవేశిక’గా మారింది.

జనవరి – 22 – 1947 : ఆబ్జెక్టివ్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

జూలై – 22 – 1947 : జాతీయ పతాకాన్ని స్వీకరించారు

ఆగస్టు – 15 – 1947 : స్వాతంత్య్రం సిద్దించింది. డోమినియన్ ఆఫ్ ఇండియా & పాకిస్థాన్ లుగా విడిపోయాయి.

ఆగస్టు – 29 – 1947 : Dr.B.R.అంబేద్కర్ చైర్మన్‌గా డ్రాఫ్టింగ్ కమిటీని (ముసాయిదా కమిటీ) నియమించారు.

జూలై – 16 – 1948 : రాజ్యాంగ సభకు రెండో వైస్ చైర్మన్ గా టీ. కృష్ణమాచారి ఎంపికయ్యారు.

నవంబర్ – 26 – 1949 : రాజ్యాంగ రచన పూర్తి, రాజ్యంగ సభ భారత రాజ్యంగాన్ని అమోదించారు

జనవరి – 24 – 1950 : రాజ్యాంగ సభ చివరి సమావేశం. భారత రాజ్యాంగాన్ని అమోదిస్తూ సంతకాలు పూర్తి. (8 – షెడ్యూల్స్, 22 – భాగాలు, 385 ఆర్టికల్స్ కలవు)

జనవరి – 26 – 1950 : భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ( రాజ్యాంగ రచనకు 2సం. ల 11 నెలల 18 రోజులు పట్టింది.) (దాదాపు 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది.)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు