Home > SPORTS > IND VS PAK – పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం

IND VS PAK – పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం

BIKKI NEWS (FEB. 23) : INDIA WON THE MATCH AGAINST PAKISTAN IN ICC CHAMPIONS TROPHY. ఐసీసీ చాంపియన్స్ ట్రోపీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.

INDIA WON THE MATCH AGAINST PAKISTAN IN ICC CHAMPIONS TROPHY.

టాస్ గెలిచి మొదట బ్యాచ్ బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు 48.2 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లలో సౌద్ షకీల్ – 62, కెప్టెన్ రిజ్వాన్ – 46, కుష్‌దిల్ – 28 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ – 3, హర్దిక్ పాండ్యా – 2, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ లు తలో వికెట్ చొప్పున తీశారు.

అనంతరం 242 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా సునాయాసంగా లక్ష్యం చేదించేశారు.

భారత బ్యాట్స్ మెన్ లలో విరాట్ కోహ్లీ సెంచరీ (100*) తో పాటు, శ్రేయస్ అయ్యర్ – 56, గిల్ – 46 పరుగులతో రాణించారు.

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేలలో 14000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాదించిన సచిన్ టెండూల్కర్, కూమర సంగక్కర సరసన నిలిచాడు.

అలాగే అంతర్జాతీయ వన్డేల్లో 51 వ సెంచరీ, మొత్తం మీద సెంచరీల సంఖ్య 82 కు చేరింది.

మార్చి 03 న భారత జట్టు కివీస్ తో తలడనుంది. కివీస్ ఇప్పటికే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది.

ఈ ఓటమి తో పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి వైదోలిగే ప్రమాదం అంచున చేరింది. పాకిస్థాన్ కు బంగ్లాదేశ్ తో మ్యాచ్ మిగిలి ఉంది.

సంక్షిప్త స్కోర్ :

పాకిస్థాన్ : 241 /10 (49.2)

భారత్ : 244/4 (42)

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు