IE APP – ఇంటర్ విద్యలో ‘ఐఈ యాప్’ – ఇక నుంచి ఆన్లైన్ పర్యవేక్షణ

BIKKI NEWS (JULY 02) : IE APP IN INTERMEDIATE EDUCATION. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పనితీరును పర్యవేక్షించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు IE APP (ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) యాప్ ను అందు బాటులోకి తీసుకొచ్చారు.

IE APP IN INTERMEDIATE EDUCATION

ఐటీశాఖ రూపొందించిన ఈ యాప్ ద్వారా రోజువారీగా విద్యార్థుల హాజరు, అకడమిక్ క్యాలెండర్ అమలు, తనిఖీలు, అధ్యాపకుల పనితీరు, పాఠ్యపుస్తకాల ట్రాకింగ్ తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు.

ఇటీవలే రెండు మల్టీజోన్లలోని జిల్లా ఇంటర్మీ డియట్ విద్యాధికారులు, కళాశాల ప్రిన్సిపాళ్లకు రెండు రోజుల పాటు యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. యాపు డౌన్లోడ్ చేసుకుని, రోజువారీగా వివరాలు నమోదు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో 422 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 78 వేలకు పైగా సెకండియర్ విద్యార్థులుండగా, ప్రస్తుతానికి 40వేలకు పైగా విద్యార్థులు ఫస్టియర్ లో చేరారు.

393 మంది ప్రిన్సిపాళ్లు, 3,671 మంది లెక్చరర్లు పని చేస్తున్నారు. కళాశాలలపై పర్యవేక్షణ పెంచడం ద్వారా విద్యా ప్రమాణాలు పెంచే దిశలో ఈ యాప్ ను అందు బాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు