IDBI BANK JOBS : 2,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ముంబై (నవంబర్ – 22) : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI BANK RECRUITMENT) 2023-24 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), ఎగ్జిక్యూటివ్ (EXECUTIVE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు (IDBI JAM and ESO JOBS RECRUITMENT NOTIFICATION) కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

పోస్టుల వివరాలు :

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800 (ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ – 216, ఈడబ్ల్యూఎస్- 80, యూఆర్- 324)

ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఒప్పంద ప్రాతిపదికన): 1,300 (ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ – 326, ఈడబ్ల్యూఎస్- 130, యూఆర్- 558)

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం :

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 – రూ.6.50 లక్షలు.

ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000 – రూ.31,000.

దరఖాస్తు ఫీజు : రూ .1,000/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200/-)

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్
ఆధారంగా.

దరఖాస్తు గడువు : నవంబర్ 22 2023 నుండి డిసెంబర్ 06 – 2023 వరకు

ఆన్లైన్ పరీక్ష తేదీ :

జేఏఎం – డిసెంబర్ 31 – 2023న
ఎగ్జిక్యూటివ్ – డిసెంబర్ 30 – 2023న

పూర్తి నోటిఫికేషన్ : PDF DOWNLOAD

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx