BIKKI NEWS : భూమి మీద అతి పురాతన నాగరికతలు 1921 నాటి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో భారత ఉపఖండంలో రావి, సింధూ నది పరివాహకాలలో హరప్పా, మొహంజోదారో నాగరికతలు (harappa-and-mohenjodaro-civilizations-important-facts) బయల్పడ్డాయి…
అక్కడ లభించిన వస్తువులను బట్టి అప్పట్లోనే పట్టణ నాగరికత ఎంతో అబివృద్ది చెందినదని చెప్పవచ్చు. అప్పటి ముఖ్య పట్టణాల గురించి తెలుసుకుందాం…
harappa and mohenjodaro civilizations important facts
★ హరప్పా :- (1921)
శాస్త్రవేత్త : దయారాం సహానీ
రాష్ట్రం : పంజాబ్ (పాకిస్థాన్)
నది : రావి నది
విశేషాలు :
- ధాన్యాగారాలు,
- శవపేటిక,
- కాంస్యంతో చేసిన ఎడ్లబండ్లు,
- ‘H’ ఆకారం శ్మశాన వాటిక.
★ మొహంజోదారో :- (1922)
శాస్త్రవేత్త : ఆర్.డి. బెనర్జీ
రాష్ట్రం : సింధ్ (పాకిస్తాన్)
నది : సింధు నది
విశేషాలు :
- మహాధాన్యాగారం,
- మహా స్నానవాటిక,
- మెసపటోమియాకు చెందిన మూడు స్థూపాకార ముద్రికలు,
- కాంస్య నాట్యగత్తె విగ్రహం,
- స్టీటైట్ తో తయారుచేసిన గడ్డపు మనిషి
★ చన్హుదారో :- (1931)
శాస్త్రవేత్త : ఎం.జి. మజుందార్
నది : సింధు నది.
రాష్ట్రం : సింధ్ (పాకిస్తాన్)
విశేషాలు :
- కోట లేని ఏకైక నగరం,
- గవ్వలు, పూసలతో ఆభరణాలు తయారయ్యే పరిశ్రమలు,
- పిల్లికి సంబంధించిన ఆధారాలు.
★ లోథాల్ :- (1955 )
శాస్త్రవేత్త : ఎస్.ఆర్. రావు
నది : భోగావో
రాష్ట్రం : గుజరాత్
ముఖ్య విశేషాలు ::
- రేవు పట్టణం,
- నౌకా నిర్మాణ కేంద్రం,
- ఒకే సమాధిలో జంట శవాలు,
- వరి గింజ,
- టెర్రా కోట గుర్రపు బొమ్మ
★ కాళీ బంగన్ :- (1961)
శాస్ర్తవేత్తలు : బి.బి. లాల్, బి.కె, థాపర్
రాష్ట్రం : రాజస్థాన్
నది : ఘగ్గర్ (సరస్వతి)
ముఖ్య విశేషాలు ::
- ఒక వరుసలో ఏడు హోమగుండాలు,
- నాగలి గుర్తులున్న వ్యవసాయ భూమి,
- సర్పిలాకార బొమ్మల లిపి.
★ ధోలవీర :- (1991)
శాస్ర్తవేత్తలు : జె.పి. జోషి ఆర్.ఎస్. బిస్త్
రాష్ట్రం : గుజరాత్
నది : నది లేదు
ముఖ్య విశేషాలు ::
- స్టేడియం,
- రిజర్వాయర్,
- భారతదేశంలో ఉన్న సింధు నగరాల్లో అత్యంత విశాలమైంది.