GURUKULA JOBS – నేడు దివ్యాంగ అభ్యర్థుల జాబితా

BIKKI NEWS (JUNE 24) : GURUKULA PWD CANDIDATES MERIT LIST BY TREIRB. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో అర్హత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల జాబితాను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థుల మెరిట్ జాబితాను చూసుకోవచ్చు.

GURUKULA PWD CANDIDATES MERIT LIST BY TREIRB

ఇప్పటివరకు సాధారణ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా షెడ్యూల్ లు విడుదల అవుతున్న నేపథ్యంలో, ఈరోజు దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేయనుంది. దీంతో పూర్తిగా మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు అవుతుంది.

ప్రాథమికంగా ఎంపికైన దివ్యాంగ అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి మరియు కోటిలోని ఈ ఎన్ టి ఆస్పత్రిలో నుండి నివేదిక వచ్చినట్లు తెలిపారు. దీంతో దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులకు వివిధ సొసైటీలు తమ షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించుకుంటాయని ట్రిబ్ తెలిపింది.

అలాగే వివిధ గురుకుల సొసైటీలు తమ పరిధిలో నియామకాలు చేపట్టేందుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేస్తున్నాయి. తాజాగా బీసీ గురుకుల విద్యా సంస్థ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసింది

అలాగే మిగతా సొసైటీలు కూడా ఈరోజు లేదా రేపు సర్టిపికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో దివ్యాంగ అభ్యర్థులు కూడా ఇదే షెడ్యూల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జూలై నెలలో అభ్యర్థులకు సంబంధిత కళాశాలలు, పాఠశాలల్లో పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో వీరి పోస్టింగ్ లతో గురుకుల విద్యాలయ సంస్థలు పూర్తి సిబ్బందితో పని చేయనున్నాయి.

వెబ్సైట్ : https://treirb.cgg.gov.in/home

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు