GURUKULA ADMISSIONS – గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్

BIKKI NEWS (FEB. 26) : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు (MJP RJC CET 2024) 2024-25 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 28 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు గురుకులాల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు.

బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు RJC CET 2024 మరియు సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాల కొరకు RDC CET 2024 నోటిఫికేషన్ లు విడుదల చేశారు.

మొత్తం 257 గురుకుల జూనియర్ కళాశాలలు, 76 డిగ్రీ గురుకుల కళాశాలలు కలవు.

ఇంటర్ గ్రూపులు : MPC, BPC, CEC, HEC, MEC మరియు ఒకేషనల్ కోర్సులు

డిగ్రీ గ్రూపులు : BSc, BA, BBA, BCom, BFT.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 28 నుంచి ఎప్రిల్ – 15 – 2024 వరకు కలదు

దరఖాస్తు ఫీజు : 200/-

హల్ టికెట్ల డౌన్లోడ్ : ఎప్రిల్ – 21 – 2024 నుండి

ప్రవేశ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 28 – 2024

ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో ప్రతిభా మరియు రిజర్వేషన్లు ఆధారంగా.

సందేహలకు : 040-23328266, 18005707778 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇంటర్ అడ్మిషన్స్ వెబ్సైట్ : http://mjptbewrcis.telangana.gov.in

డిగ్రీ అడ్మిషన్స్ వెబ్సైట్ : www.tsrdccet.cgg.gov.in