Home > LATEST NEWS > Guest Lecturers – ఉద్యోగ భద్రతా, రెన్యూవల్ కొరకు వినతిపత్రం

Guest Lecturers – ఉద్యోగ భద్రతా, రెన్యూవల్ కొరకు వినతిపత్రం

BIKKI NEWS (AUG. 24) : guest lectures renewal and job security issue. మంచిర్యాల, జగిత్యాల జిల్లా గెస్ట్ లెక్చరర్స్ తమ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ విప్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని జగిత్యాల లో కలిసి తమ ఉద్యోగ భద్రత మరియు రెన్యూవల్ అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

guest lectures renewal and job security issue.

ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి కళాశాలలో పని చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి సంవత్సరానికి రెన్యువల్ ఉత్తర్వులు రాకుండా, కేవలం ఒక జులై నెలకు మాత్రమే రావడం జరిగిందని దృష్టికి తీసుకెళ్లారు.

ఆగస్టు ఒకటి నుంచి కొనసాగింపు జీవో వస్తుందని ఎదురు చూసి గత 20 రోజులుగా విధులను బహిష్కరించి జీవో కొరకు అందరూ మంత్రులను మరియు అధికారులను కలవడం జరుగుతుంది కానీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42,000 జీతం మరియు 12 నెలలకు కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం విప్ అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు ఎమ్మెల్సీ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ గారు కమిషనర్ గారితో మాట్లాడి తొందరగా గెస్ట్ లెక్చరర్స్ ను రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరిగిందని తెలిపారు. అలాగే ఉద్యోగ భద్రతా విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హమీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా లెక్చరర్స్ శిరీష, శంకరయ్య, సతీష్ , నాగేశ్వర్, రాజ్ కుమార్, శ్రీవాణి సుష్మ మరియు మంచిర్యాల గెస్ట్ లెక్చరర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు