Home > TELANGANA > రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా గద్దర్‌ జయంతి – మంత్రి జూపల్లి

రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా గద్దర్‌ జయంతి – మంత్రి జూపల్లి

BIKKI NEWS (JAN. 31): ఉద్యమకారుడిగా, విప్లవ కవిగా తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజా గాయకుడు గద్దర్‌ జయంతి వేడుకలను రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా (Gaddar Jayanthi as state government official programme) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రవీంద్రభారతిలో గద్దర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని గద్దర్‌ తన జీవితాంతం పరితపించి, తన గళంతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు.