BIKKI NEWS (JAN. 31) : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే సంచలన (electronic chip in human brain by neuralink ) ప్రయోగానికి ఎలన్ మస్క్ యొక్క న్యురాలింక్ సంస్థ . దీని ద్వారా మనిషి తన ఆలోచనతోనె తన చూట్టు ఉన్నా వాటిని కంట్రోల్ చేయవచ్చు.
ఈ ఇలాంటి సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్. తన న్యూరాలింక్ సంస్థ తాజాగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చింది. ఈ క్రమంలో మెదడులో చిప్ ను అమర్చే తొలి పరీక్ష విజయవంతమైందని ఎలన్ మస్క్ ప్రకటించారు. చిప్‌ను అమర్చిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని మస్క్ చెప్పారు. మస్క్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు.
మానవ మెదడులో చిప్‌ను అమర్చేందుకు న్యూరాలింక్ సంస్థకు గత ఏడాది మేలో US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ప్రారంభ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎలాన్ మస్క్ అన్నారు. న్యూరాలింక్ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. స్వతంత్ర సంస్థాగత సమీక్ష బోర్డు నుండి ఆమోదం పొందబడింది. వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ని పరీక్షించే వైద్య పరికరం PRIME (Precise Robotically Implanted Brain Computer Interface) ట్రయల్ విజయవంతమైంది. ఈ పరీక్ష ఉద్దేశ్యం మానవ మెదడులో చిప్‌ను అమర్చడం ద్వారా భద్రతను అంచనా వేయవచ్చు.
★ న్యూరాలింక్ అంటే ఏమిటి?
న్యూరాలింక్ అనేది స్టార్టప్, దీనిని ప్రముఖ బిలియనీర్ ఎలోమన్ మస్క్ 2016లో కొంతమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో కలిసి ప్రారంభించారు. మానవ మెదడులో అమర్చ గల చిప్ ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడానికి న్యూరాలింక్ పనిచేస్తుంది. ఈ చిప్స్ సహాయంతో నడవలేని, మాట్లాడలేని, చూడలేని వికలాంగులు కొంత వరకు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారని విశ్వసిస్తుంది. అలాగే.. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరగడం, రిమోట్ తో టీవీలను, ఏసీలను కంట్రోల్ చేయడం సాధారణమే.. కానీ, రానున్న రోజుల్లో ఈ సాంకేతికలను ఉపయోగించి.. మనిషి తన ఆలోచనలతోనే వీటన్నింటినీ కంట్రోల్ చేస్తాడు. ఈ చిన్న చిప్ సహాయంతో కంప్యూటర్లు లేదా ఫోన్ల వంటి పరికరాలకు కూడా తన ఆలోచనలతో ఆపరేట్ చేయవచ్చు.
★ చిప్ ఎలా ఉంటుంది
రోగి మెదడులో 5 రూపాయాల నాణేం పరిమాణంలో ఉన్న ఒక పరికారాన్ని కంపెనీ శస్త్రచికిత్స ద్వారా అమర్చుతారు. లింక్ అనే ఇంప్లాంటేషన్ ద్వారా ఈ టెక్నాలజీ పని చేస్తుంది. దీనితో పాటు, కంపెనీ చాలా నిధులను కూడా సేకరించింది. అలాగే.. మస్క్ కంపెనీ కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి..కంపెనీ ఇంతకుముందు ల్యాబ్‌లో జంతువులపై చిప్ పరీక్షను నిర్వహించింది, దీంతో కంపెనీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 2022 సంవత్సరంలో కంపెనీ అమెరికా కేంద్ర విచారణను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. పరీక్ష సమయంలో కంపెనీ 1500 జంతువులను చంపిందని, వీటిలో ఎలుకలు, కోతులు, పందులు మొదలైనవి ఉన్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER