Home > EDUCATION > EXAMS PAPER LEAK ACT – పేపర్ లీక్ పై కఠిన చట్టం

EXAMS PAPER LEAK ACT – పేపర్ లీక్ పై కఠిన చట్టం

BIKKI NEWS (JUNE 22) : The Examinations Prevention of unfair means act 2024. విద్య ఉద్యోగ రాత పరీక్ష పేపర్లను లీక్ చేస్తే కఠిన చర్యలు పడేలా నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. “ది పబ్లిక్ ఎగ్జామినేషనన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అండ్ ఫెయిర్ యాక్ట్ 2024” పేరుతో ఈ చట్టం జూన్ 21 – 2024 నుండి అమల్లోకి వచ్చింది. EXAMS PAPER LEAK ACT 2024.

EXAMS PAPER LEAK ACT 2024

ఈ చట్టం ద్వారా నీకు వీరులకు గరిష్టంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది అంతేకాక జరిమానాతో పాటు పదేళ్ల వరకు కఠిన జైలు శిక్ష అమలు కూడా చేయనున్నారు.

విద్యార్థుల, ఉద్యోగార్డుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీకు వీరులకు ముకుతాడు వేసే ఉద్దేశంతో ఈ చట్టంలో కఠిన చర్యలను కేంద్రం పొందుపరిచింది.

తాజాగా జాతీయ స్థాయి నీట్, యుజిసి నెట్, సిఎస్ఐఆర్ నెట్ వంటి పరీక్షల పేపర్లు లీక్ ఉదంతాలు వెలుగు చూసి కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఈ చట్టం అమల్లోకి రావడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ చట్టం ప్రకారం పరీక్ష పేపర్ ప్రశ్నలు లేదా జవాబులు లీకు చేసినా, పరీక్ష రాసే అభ్యర్థులకు సహాయం చేసినా‌, కంప్యూటర్ నెట్వర్క్ ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించిన నకిలీ అడ్మిట్, ర్యాంక్ కార్డులు జారీ చేసినా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలాగే ఈ నేరాలు చేసిన వారు వ్యవస్థీకృతంగా చేస్తుంటే వారి ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఇకనుండి పరీక్ష పేపర్ లీకులకు సంబంధించిన కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు. ఇందులో కోటి రూపాయల వరకు జరిమానా తో పాటు, ఐదు నుండి పది సంవత్సరాల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు