Engineering Counseling – వెబ్ ఆప్షన్లు గడువు పెంపు

BIKKI NEWS (JULY 16) : engineering web options date extended. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కొరకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ కు సంబంధించి వెబ్ ఆప్షన్ల గడువును జూలై 17వ తేదీ వరకు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

engineering web options date extended

షెడ్యూల్ ప్రకారం జులై 16వ తేదీతో వెబ్ ఆప్షన్ కు గడువు ఉంది. అయితే కన్వీనర్ కోట సీట్ల సంఖ్య పెంపునకు విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడంతో వెబ్ ఆప్షన్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 99 వేల బీటెక్ సీట్లు ఉన్నాయి వీటిలో 70,500 కన్వీనర్ కోట సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా ఇంజనీరింగ్ కళాశాలు ప్రాముఖ్యత లేని కోర్సులను మూసివేసి ఆ సీట్లను సీఎస్ఈ కోర్సులకు మార్చుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిని ఇన్ని రోజులు పెండింగ్ లో ఉంచిన విద్యాశాఖ తాజాగా అనుమతులు జారీ చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటా సీట్ల సంఖ్య మరో 6,500 పెరగనున్నాయి.

వెబ్సైట్ : https://eapcet.tsche.ac.in/TSEAPCET/Admission.aspx

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు