ENGINEERING COUNSELING – ఇంజనీరింగ్ సీట్ల పెంపు – వెబ్ ఆప్షన్స్ మార్చుకొండి

BIKKI NEWS (JULY 17) : engineering seats are increased in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2024 సంబంధించి మొదటి విడత వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. అయితే దాదాపు 1,848 సీట్లు కన్వీనర్ కోటాలో తాజాగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న విద్యార్థులు మరొకసారి వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే ఈ సీట్లు అందుబాటులో ఉన్న కళాశాలలను కూడా ఎంచుకోవచ్చు.

engineering seats are increased in telangana

కావున ఇప్పటికే వెబ్ ఆప్షన్ లు పెట్టుకున్న అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకొని, కొత్తగా సీట్లు కేటాయించిన ఇంజనీరింగ్ కళాశాలలను కూడా వెబ్ ఆప్షన్ లో ఎంచుకోవచ్చు.

తాజాగా విద్యాశాఖ రాష్ట్రంలో 2640 బిటెక్ సీట్లకు అనుమతి ఇచ్చింది దీంతో మొత్తం బీటెక్ సీట్ల సంఖ్య 1,01,661 కి చేరింది. ఇందులో కన్వీనర్ కోట సీట్ల సంఖ్య 72,741 కి పెరిగింది.

అయితే ఈ సీట్లు ఏ శాఖలో, ఏ ఇంజనీరింగ్ కళాశాలలో పెంచారో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం వెళ్లడం లేదని హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

విశ్వవిద్యాలయాల ఎన్ఓసి తీసుకుని, ఏఐసిటిఈ అనుమతి పొందిన తర్వాత కూడా తమకు సీట్లు కేటాయించకుండా, అనుమతులు నిరాకరించడం లేదా పెండింగ్ లో పెట్టడం పట్ల ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

వెబ్సైట్ : https://eapcet.tsche.ac.in/TSEAPCET/Admission.aspx

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు